టీమ్‌ఇండియా చాలా మెరుగైంది: స్మృతి మంధాన

ప్రధానాంశాలు

Published : 15/09/2021 01:09 IST

టీమ్‌ఇండియా చాలా మెరుగైంది: స్మృతి మంధాన

బ్రిస్బేన్‌: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత టీమ్‌ఇండియా చాలా మెరుగైందని ఓపెనర్‌ స్మృతి మంధాన తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా సత్తాచాటుతుందని చెప్పింది. ఈనెల 21న ప్రారంభంకానున్న సిరీస్‌లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్లు మూడేసి వన్డేలు.. టీ20ల్లో తలపడనున్నాయి. ఈనెల 30 నుంచి అక్టోబరు 3 వరకు జరిగే డేనైట్‌ టెస్టు (గులాబి బంతి)లో పోటీపడనున్నాయి. నిరుడు ఎంసీజీలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరి సారిగా తలపడ్డాయి. ‘‘పొట్టి కప్పు ఫైనల్‌ తర్వాత టీమ్‌ఇండియా చాలా మెరుగైంది. ప్రపంచకప్‌ అనంతరం కరోనా కారణంగా విరామం లభించింది. ఈ సమయంలో క్రీడాకారిణులంతా తమ ఆటపై దృష్టిసారించారు. లోపాల్ని సరిదిద్దుకుని మరింతగా రాటుదేలారు. ఫిట్‌నెస్‌, నైపుణ్యంపై జట్టంతా పనిచేసింది. గత అయిదారు నెలలుగా క్రికెట్‌ ఆడుతూ లయను దొరకబుచ్చుకున్నాం’’ అని స్మృతి తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన