దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌

ప్రధానాంశాలు

Published : 15/09/2021 01:09 IST

దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌

చివరి టీ20లోనూ లంక చిత్తు

కొలంబో: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో 1-2తో ఓడిన దక్షిణాఫ్రికా.. టీ20 సిరీస్‌లో మాత్రం ప్రత్యర్థిని పోటీలో లేకుండా చేసింది. మూడు టీ20ల్లోనూ ఘన విజయాలతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కంటే మిన్నగా మూడో టీ20లో ఆ జట్టు ఘనవిజయాన్నందుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. మొదట ఫోర్టుయిన్‌ (2/21), రబాడ (2/23), కేశవ్‌ మహరాజ్‌ (1/14)ల ధాటికి లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులే చేయగలిగింది. కుశాల్‌ పెరీరా (39), చమిక కరుణరత్నె (24 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అనంతరం ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (59 నాటౌట్‌; 46 బంతుల్లో 7×4), రీజా హెండ్రిక్స్‌ (56 నాటౌట్‌; 42 బంతుల్లో 5×4, 1×6) చెలరేగడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోకుండా 14.4 ఓవర్లలోనే ఛేదించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన