హనుమకొండలో క్రీడల పండుగ

ప్రధానాంశాలు

Published : 15/09/2021 01:09 IST

హనుమకొండలో క్రీడల పండుగ

నేటి నుంచే జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌

ఈనాడు, వరంగల్‌: 60వ జాతీయ ఓపెన్‌  అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ఈనెల 19 వరకు జరిగే ఈ పోటీలకు హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ మైదానం వేదికగా నిలువనుంది. అయిదు రోజుల టోర్నీలో 48 ఈవెంట్లలో క్రీడాకారులు పోటీ పడనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 24 మంది సహా మొత్తం 573 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఈ టోర్నీకి స్టార్‌ క్రీడాకారులు దూరమయ్యారు. ఒలింపిక్స్‌లో పోటీపడిన వారిలో రేస్‌ వాకర్‌ భావనా, రన్నర్‌ రేవతి మాత్రమే పోటీపడనున్నారు. టోర్నీతో పాటు రూ.7.86 కోట్ల వ్యయంతో నిర్మించిన సింథటిక్‌ ట్రాక్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ప్రారంభించనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన నీరజ్‌ చోప్రా సైతం క్రీడలకు అతిథిగా వచ్చే అవకాశం ఉందని అథ్లెటిక్స్‌ సంఘం ప్రతినిధులు తెలిపారు. మాజీ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్‌ ఇప్పటికే హనుమకొండకు చేరుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన