దాదా, మహి.. ఇద్దరూ గొప్పే కానీ!

ప్రధానాంశాలు

Published : 16/09/2021 03:12 IST

దాదా, మహి.. ఇద్దరూ గొప్పే కానీ!

దిల్లీ: సౌరభ్‌ గంగూలీ, మహేంద్ర సింగ్‌ ధోనీల్లో ఎవరు గొప్ప కెప్టెన్‌ అంటే సమాధానం చెప్పడం కష్టం. ఇదే ప్రశ్న మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను అడిగితే.. ‘‘ఇద్దరూ మెరుగైన సారథులే. కానీ ఇద్దరిలో ఎవరు ఉత్తమం అని అడిగితే గంగూలీ పేరు చెబుతా. ఎందుకంటే ఏమీ లేని స్థితి నుంచి అతను జట్టును నిర్మించాడు. యువ ఆటగాళ్లను ఎంచుకుని జట్టును పునర్నిర్మించడమే కాక విదేశాల్లో ఎలా గెలవాలో నేర్పించాడు. కఠినమైన విదేశీ పర్యటనల్లో సిరీస్‌లను సమం చేశాం. విజయాలూ సాధించాం. ధోని కెప్టెన్‌ అయ్యే సరికే జట్టు మంచి స్థితిలో ఉంది.  కొత్త జట్టును సిద్ధం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అతనూ మంచి కెప్టెనే. కానీ గంగూలీనే ఉత్తమం’’ అని చెప్పాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన