అడ్వాణీకి ఆసియా టైటిల్‌

ప్రధానాంశాలు

Published : 17/09/2021 02:52 IST

అడ్వాణీకి ఆసియా టైటిల్‌

దోహా: కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తిరిగి బరిలో దిగిన తొలి టోర్నీలోనే భారత అగ్రశ్రేణి క్యూ స్పోర్ట్‌ క్రీడాకారుడు పంకజ్‌ అడ్వాణీ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆసియా స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. గురువారం ఫైనల్లో అతను 6-3 తేడాతో అమిర్‌ సర్ఖోష్‌ (ఇరాన్‌)పై విజయం సాధించాడు. వరుసగా తొలి మూడు ఫ్రేమ్‌లు గెలిచిన పంకజ్‌ 3-0 ఆధిక్యంతో దూసుకెళ్లాడు. మధ్యలో కాస్త వెనకబడ్డప్పటికీ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలుపుతో మ్యాచ్‌ ముగించాడు. 2019లో   చివరగా పంకజ్‌ ఈ టైటిల్‌ గెలిచాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన