సత్తాచాటిన ‘లక్ష్య’ అథ్లెట్‌ నరేష్‌

ప్రధానాంశాలు

Published : 17/09/2021 02:52 IST

సత్తాచాటిన ‘లక్ష్య’ అథ్లెట్‌ నరేష్‌

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌లో రికార్డు స్వర్ణం
4×100 మీ. రిలేలో తెలంగాణ అమ్మాయిలకు కాంస్యం

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యంత వేగవంతమైన రన్నర్‌గా ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్‌ నరేష్‌కుమార్‌ నిలిచాడు. ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమమైన ‘లక్ష్య’లో భాగంగా శిక్షణ పొందుతున్న ఈ ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు గురువారం హనుమకొండలో జరిగిన పురుషుల 100మీ. పరుగులో ఛాంపియన్‌గా నిలిచాడు. 10.30 సెకన్లలో రేసు పూర్తి చేసి సరికొత్త మీట్‌ రికార్డుతో పసిడి పట్టేశాడు. అమ్లాన్‌ (అస్సాం- 10.334సె), హర్జీత్‌ సింగ్‌ (సర్వీసెస్‌- 10.340సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. భారత స్ప్రింట్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అయిదు ప్రదర్శనల్లో ఒకటిగా 23 ఏళ్ల నరేష్‌ టైమింగ్‌ చోటు దక్కించుకుంది. 2001లో ఈ మీట్‌లో అనిల్‌ కుమార్‌ (10.37సె) నెలకొల్పిన రికార్డును నరేష్‌ బద్దలు కొట్టాడు. మహిళల 4×100మీ. రిలేలో తెలంగాణకు కాంస్యం దక్కింది. దీప్తి, నిత్య, నందిని, మాయావతితో కూడిన జట్టు 47.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది. రైల్వేస్‌ (45.84సె), తమిళనాడు (47.06సె) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన