కోచ్‌గా మళ్లీ కుంబ్లే?

ప్రధానాంశాలు

Published : 19/09/2021 00:59 IST

కోచ్‌గా మళ్లీ కుంబ్లే?

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ తర్వాత ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి దిగిపోతుండగా.. తదుపరి శిక్షకుడిగా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే పేరు తెరపైకి వచ్చింది. అంతా సవ్యంగా సాగితే అతడు మరోసారి టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవాలని కుంబ్లేతో పాటు వీవీఎస్‌ లక్ష్మణ్‌ను బీసీసీఐ కోరనున్నట్లు తెలుస్తోంది. కుంబ్లే 2016-17లో భారత జట్టు కోచ్‌గా వ్యవహరించాడు. కానీ కెప్టెన్‌ కోహ్లీతో విభేదాల కారణంగా అర్ధంతరంగా వైదొలగాల్సివచ్చింది. అతడి స్థానంలోనే శాస్త్రి నియమితుడయ్యాడు. ఇప్పుడు కుంబ్లే మళ్లీ రేసులోకి వచ్చాడు. కోచ్‌గా అతడే ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. లక్ష్మణ్‌ కూడా పోటీలో ఉన్నాడు. ఈ పరిణామాలపై ఓ బీసీసీఐ అధికారి స్పందిస్తూ.. ‘‘కుంబ్లే అర్ధంతరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది. కోహ్లి ఒత్తిడికి తలవంచి పాలకుల కమిటీ.. కుంబ్లేను తప్పించడం సరికాదు. అయితే కుంబ్లే, లక్ష్మణ్‌లు కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది ప్రశ్న’’ అన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన