ఆర్సీబీపై ఆ ప్రభావం ఉండదు: హెసన్‌

ప్రధానాంశాలు

Published : 22/09/2021 03:06 IST

ఆర్సీబీపై ఆ ప్రభావం ఉండదు: హెసన్‌

అబుదాబి: ప్రస్తుత సీజన్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న విరాట్‌ కోహ్లి నిర్ణయం కోల్‌కతాతో మ్యాచ్‌లో బెంగళూరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆ జట్టు ప్రధాన కోచ్‌ మైక్‌ హెసన్‌ అన్నాడు. ‘‘కోహ్లి చాలా ముందే ప్రకటన చేయడం మంచిదే. ఎందుకంటే ఆటగాళ్లందరికీ ఆ విషయం తెలుస్తుంది. అయితే కోల్‌కతాపై బెంగళూరు ప్రదర్శనను అది ఏమాత్రం ప్రభావితం చేయలేదు. మా బ్యాటింగ్‌ సరిగా లేదు. పరిస్థితులకు అన్వయించుకోలేకపోయాం. అయితే మేం త్వరగా పుంజుకుంటామనే నమ్మకం మాకుంది’’ అని చెప్పాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన