కివీస్‌, ఇంగ్లాండ్‌పై ప్రతీకారానికి సిద్ధమవ్వండి

ప్రధానాంశాలు

Published : 22/09/2021 03:06 IST

కివీస్‌, ఇంగ్లాండ్‌పై ప్రతీకారానికి సిద్ధమవ్వండి

ఇస్లామాబాద్‌: న్యూజిలాండ్‌ బాటలో ఇంగ్లాండ్‌ కూడా తమ దేశ పర్యటన నుంచి తప్పుకోవడం పట్ల పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ జట్లపై ప్రతీకారానికి సిద్ధం కావాలని తమ జట్టుకు రమీజ్‌ పిలుపునిచ్చాడు. ‘‘ఇంగ్లాండ్‌ కూడా పాక్‌ పర్యటనను రద్దు చేసుకోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ ఇది ఊహించిందే. దురదృష్టవశాత్తూ ఇలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు ఒకదానికి ఒకటి మద్దతుగా నిలుస్తాయి. ఈ జట్లు వచ్చినపుడు బాగా ముద్దు చేసే మాకు ఇదో గుణపాఠం. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా మా లక్ష్యం భారతే. ఇప్పుడు ఆ జాబితాలో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ చేరాయి. తమకు మంచి చేయని జట్లపై మైదానంలో ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్థాన్‌ జట్టు మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి’’ అని రమీజ్‌ అన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన