మిథాలీ మెరిసినా..

ప్రధానాంశాలు

Published : 22/09/2021 03:06 IST

మిథాలీ మెరిసినా..

ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి

మెకాయ్‌: ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది.  మంగళవారం తొలి వన్డేలో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియాను ఓడించింది. వన్డేల్లో వరుసగా 25వ విజయాన్ని నమోదు చేసింది. మొదట భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 225 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (63) అర్ధ సెంచరీతో మెరిసింది. షెఫాలీ (8), స్మృతి మంధాన (16) విఫలమయ్యారు. మిగతా బ్యాటర్లు రాణించలేదు. అనంతరం ఆసీస్‌ 41 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాచెల్‌ హేన్స్‌ (93 నాటౌట్‌), ఎలీసా హీలీ (77), కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (53 నాటౌట్‌) సత్తాచాటి ఆసీస్‌కు విజయాన్ని అందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన