భారత్‌లో పర్యటించిన ఏఎఫ్‌సీ బృందం

ప్రధానాంశాలు

Published : 24/09/2021 02:05 IST

భారత్‌లో పర్యటించిన ఏఎఫ్‌సీ బృందం

దిల్లీ: వచ్చే ఏడాది జరిగే మహిళల ఆసియాకప్‌ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫడరేషన్‌ (ఏఎఫ్‌సీ) బృందం ఇటీవల భారత్‌లో పర్యటించింది. ఈనెల 16 నుంచి 21 వరకు ఈ బృంద సభ్యులు ఈ టోర్నీ జరిగే వేదికలను, శిక్షణ కేంద్రాలను పరిశీలించారు. టోర్నీ ఏర్పాట్ల పట్ల ఎఫ్‌ఎఫ్‌సీ బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ టోర్నీ వేదికలైన ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియం, ముంబయి ఫుట్‌బాల్‌ ఎరీనాలోని అంధేరి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, పుణెలోని శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను ఏఎఫ్‌సీ సభ్యులు పరిశీలించారు. ఖార్‌గార్‌, పుణెలో జరగబోయే శిక్షణ శిబిరాల కేంద్రాలను కూడా వారు సందర్శించారు. మహిళల ఆసియాకప్‌ను 2023లో జరిగే ఫిఫా మహిళల ప్రపంచకప్‌కు తుది అర్హత టోర్నీగా నిర్వహించనున్నారు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియాకప్‌లో 12 జట్లు పోటీపడనున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన