పారాలింపిక్స్‌ కాంస్య విజేతకు గుండె సమస్య

ప్రధానాంశాలు

Published : 24/09/2021 02:05 IST

పారాలింపిక్స్‌ కాంస్య విజేతకు గుండె సమస్య

దిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన హైజంప్‌ పారా అథ్లెట్‌ శరద్‌ కుమార్‌ గుండె రక్తనాళాల్లో వాపు (హార్ట్‌ ఇన్‌ఫ్లమేషన్‌) ఉన్నట్లు తేలింది. అందుకు సంబంధించిన మరికొన్ని నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. పారాలింపిక్స్‌ హైజంప్‌ టీ42 విభాగంలో కంచు పతకం గెలిచిన 29 ఏళ్ల శరద్‌ గత వారం ఛాతీలో మంట కారణంగా ఎయిమ్స్‌లో చేరాడు. అక్కడ అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు హార్ట్‌ ఇన్‌ఫ్లమేషన్‌ అని తేల్చారు. దానిపై ఇంకాస్త స్పష్టత కోసం తాజాగా మరిన్ని పరీక్షలు నిర్వహించగా వాటి ఫలితాలు ఇంకా రాలేదు. ‘‘నా హృదయంలోని రక్తనాళాల్లో వాపు ఉందని ఇప్పటివరకూ వచ్చిన వైద్య ఫలితాల ద్వారా తెలిసింది. మరిన్ని టెస్టులో కోసం మళ్లీ ఆసుపత్రికి వచ్చా. నేను బయట తక్కువ సమయమే గడపడంతో ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని ఆసుపత్రి వర్గాలను కోరా’’ అని బీహార్‌లో పుట్టిన ఈ పారా అథ్లెట్‌ పేర్కొన్నాడు. చిన్నతనంలోనే టీకా వికటించడంతో పోలియో బారిన పడ్డ శరద్‌.. మోకాలి గాయం బాధిస్తున్నా టోక్యో పారాలింపిక్స్‌లో పోటీపడి మరీ పతకం దక్కించుకున్నాడు. ఆసియా పారా క్రీడల్లో ఇప్పటికే రెండు స్వర్ణాలు సొంతం చేసుకున్న అతను.. 2019 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన