అమ్మాయిలకు సవాల్‌

ప్రధానాంశాలు

Published : 24/09/2021 02:05 IST

అమ్మాయిలకు సవాల్‌

నేడే ఆసీస్‌తో భారత్‌ రెండో వన్డే

ఉదయం 10.40 నుంచి

మెకాయ్‌ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టుతో తొలి వన్డేలో అన్ని రంగాల్లో విఫలమై పరాజయం చవిచూసిన భారత్‌కు సవాల్‌! సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన రెండో వన్డేలో మిథాలీ సేన శుక్రవారం ఆసీస్‌ను ఢీకొంటుంది. భారత్‌తో పోలిస్తే అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్న ఆసీస్‌ను వారి సొంతగడ్డపై నిలువరించడం మన అమ్మాయిలకు అంత సులభం కాబోదు. ఓపెనర్లు షెఫాలీవర్మ, స్మృతి మంధాన రాణించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాల్సి ఉంది. అంతేకాదు ఎలీస్‌ పెర్రీ, డార్సి బ్రౌన్‌లు విజృంభించకుండా అడ్డుకట్ట వేయాలి. గాయంతో తొలి మ్యాచ్‌ ఆడలేకపోయిన వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెండో వన్డేలోనూ ఆడే అవకాశాల్లేవు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మపై మరింత భారం పడనుంది. అరంగేట్ర వన్డేలోనే రాణించిన 21 ఏళ్ల యస్తికా భాటియా మరోసారి సత్తా చాటాలని భారత్‌ కోరుకుంటోంది. బౌలింగ్‌లో వెటరన్‌ జులన్‌ గోస్వామి ఆరంభంలో ఆసీస్‌ను దెబ్బ కొడితే ప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం లభిస్తుంది. రెండో వన్డేలో భారత్‌ ఓడిపోతే.. అది వరుసగా భారత్‌కు మూడో సిరీస్‌ ఓటమి అవుతుంది. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ చేతుల్లో మిథాలీ సేన పరాజయం పాలైంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన