మనిక ఆరోపణలపై విచారణ

ప్రధానాంశాలు

Published : 24/09/2021 02:05 IST

మనిక ఆరోపణలపై విచారణ

ఆదేశించిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్‌ టెన్నిస్‌  క్రీడాకారిణి మనిక బత్రాకు ఊరట లభించింది. జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొంటేనే అంతర్జాతీయ టోర్నీలకు ఎంపిక చేస్తామనే భారత టీటీ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) నిబంధనపై దిల్లీ హైకోర్టు గురువారం స్టే విధించింది. అంతే కాకుండా ఈ సమాఖ్యపై, జాతీయ కోచ్‌పై మనిక చేసిన ఆరోపణలపై విచారణ నిర్వహించి ఆ నివేదికను నాలుగు వారాల్లోపు సమర్పించాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖను న్యాయమూర్తి జస్టిస్‌ రేఖ   పల్లి ఆదేశించారు. జాతీయ శిక్షణ శిబిరానికి హాజరు కాలేదనే కారణంతో తనను ఆసియా టీటీ ఛాంపియన్‌షిప్స్‌కు ఎంపిక చేయకపోవడంతో మనిక కోర్టును ఆశ్రయించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన