కొంపముంచిన నోబాల్‌

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:36 IST

కొంపముంచిన నోబాల్‌

చివరి బంతికి ఓడిన భారత్‌

మెక్‌కే: ఆస్ట్రేలియాతో భారత అమ్మాయిల రెండో వన్డే.. ప్రత్యర్థి గెలవాలంటే చివరి ఓవర్లో 13 పరుగులు చేయాలి.. ఎంతో అనుభవజ్ఞురాలైన జులన్‌ గోస్వామి చేతిలో బంతి.. అటు క్రీజులో అప్పటికే సెంచరీ చేసిన మూనీతో పాటు కేరీ ఉంది. జులన్‌.. ఒక నోబాల్‌తో సహా తొలి అయిదు బంతుల్లో పది పరుగులిచ్చింది. చివరి బంతికి మూడు పరుగులు చేస్తే ఆసీస్‌దే విజయం. కేరీ గాల్లోకి లేపిన ఆ బంతి.. మిడ్‌వికెట్‌లో ఫీల్డర్‌ చేతుల్లో పడడంతో భారత్‌ సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఆ బంతి బ్యాటర్‌ నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని మూడో అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించడంతో కథ మలుపు తిరిగింది. మరో బంతి ఆడే అవకాశం దక్కించుకున్న ఆసీస్‌.. రెండు పరుగులు చేసి గెలిచింది. శుక్రవారం రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్‌.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. మొదట మిథాలీ సేన 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (86; 94 బంతుల్లో 11×4) సత్తాచాటింది. రిచా ఘోష్‌ (44) రాణించింది. ప్రత్యర్థి బౌలర్లలో తహిల మెక్‌గ్రాత్‌ (3/45) ఆకట్టుకుంది. ఛేదనలో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ బెత్‌ మూనీ (125 నాటౌట్‌; 133 బంతుల్లో 12×4) అజేయ శతకంతో జట్టును గెలిపించింది. తహిల (74) బ్యాట్‌తోనూ మెరిసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన