క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:36 IST

క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ

యాంక్టాన్‌: ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌, మహిళల జట్టు విభాగాల్లో సత్తాచాటిన ఆమె.. వ్యక్తిగత కేటగిరీలోనూ జోరు కొనసాగిస్తోంది. కాంపౌడ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె క్వార్టర్స్‌ చేరింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె 146-142తో చెవాన్‌ (కొరియా)పై గెలిచింది. తొలి రెండు సిరీస్‌ల తర్వాత 58-59తో వెనుకంజలో నిలిచిన ఆమె.. ఆ తర్వాత అయిదు సార్లు 10 పాయింట్లు స్కోరు చేసి మరో సిరీస్‌ మిగిలి ఉండగా 117-116తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి సెట్‌లో రెండు సార్లు 10 పాయింట్ల లక్ష్యాన్ని చేరుకున్న ఆమె విజయం సాధించింది. క్వార్టర్స్‌లో తను.. అండర్‌-21 ప్రపంచ ఛాంపియన్‌ మ్లినారిచ్‌ (క్రొయేషియా)తో తలపడుతుంది. పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్‌ వర్మ 145-142తో జోజెఫ్‌ (స్లోవేకియా)పై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో అతను.. ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్‌ మైక్‌ షులోసర్‌ (అమెరికా)తో పోటీపడతాడు. ఇక మహిళల వ్యక్తిగత రికర్వ్‌లో 23 ఏళ్ల అంకిత సంచలనం సృష్టించింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె 6-4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ చె యంగ్‌ (కొరియా)పై అద్భుత విజయం నమోదు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యురాలైన యంగ్‌తో పోరులో అంకిత గొప్ప పోరాటాన్ని ప్రదర్శించింది. హోరాహోరీగా సాగిన పోరులో ఆమె ఒక్క సెట్‌ మాత్రమే కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది. 4-4తో స్కోరు సమమమైన దశలో రెండు సార్లు 10 పాయింట్లు సాధించిన ఆమె విజయాన్ని చేరుకుంది. క్వార్టర్స్‌లో కేసీ కాఫోల్డ్‌ (యుఎస్‌ఏ)ను ఆమె ఢీకొంటుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన