ఆ టెస్టు వచ్చే ఆగస్టులోనే..!

ప్రధానాంశాలు

Published : 26/09/2021 02:31 IST

ఆ టెస్టు వచ్చే ఆగస్టులోనే..!

లండన్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఇటీవల రద్దయిన అయిదో టెస్టును వచ్చే ఏడాది ఆగస్టులో నిర్వహించడానికి ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. ఆ సమయంలో భారత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అప్పుడే అదనంగా ఒక టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌ అంగీకరించింది. అయిదు టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌ ఈ నెల 10-14 తేదీల్లో జరగాల్సి ఉండగా.. భారత శిబిరంలో కరోనా కలకలం రేగడంతో మైదానంలో దిగేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన