నాలుగో బెర్తు.. నలుగురిలో ఎవరికో?

ప్రధానాంశాలు

Published : 28/09/2021 02:33 IST

నాలుగో బెర్తు.. నలుగురిలో ఎవరికో?

పీఎల్‌-14లో ఎనిమిదేసి విజయాలు సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే. 10 మ్యాచ్‌లాడి 6 విజయాలు సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా ప్లేఆఫ్స్‌కు చేరువలోనే ఉంది. మిగతా 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ఆ జట్టు ముందంజ వేస్తుంది. ఒకటి నెగ్గినా దానికి అవకాశముంటుంది. ఆ జట్టు వరుసగా అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోతే తప్ప ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక నాలుగో బెర్తు కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌, కోల్‌కతా.. ఈ నాలుగు జట్లూ 10 మ్యాచ్‌ల్లో  నాలుగేసి విజయాలతో సమాన స్థితిలో ఉన్నాయి. ఐపీఎల్‌-14 రెండో అంచెను బాగానే ఆరంభించినప్పటికీ.. తమ చివరి మ్యాచ్‌ల్లో కోల్‌కతా, రాజస్థాన్‌ ఓటమి పాలై ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. మరి ఈ నాలుగు జట్లలో నిలకడగా ఆడి ప్లేఆఫ్స్‌ బెర్తు సాధించే జట్టేదో చూడాలి. సన్‌రైజర్స్‌ సోమవారం రాజస్థాన్‌పై నెగ్గినా.. ఇప్పటికే 8 మ్యాచ్‌ల్లో ఓడటంతో ప్లేఆఫ్‌ రేసుకు దూరమైంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన