చివరి రెండు మ్యాచ్‌లు 7.30కు

ప్రధానాంశాలు

Published : 29/09/2021 03:06 IST

చివరి రెండు మ్యాచ్‌లు 7.30కు

దుబాయ్‌: ఐపీఎల్‌ చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌లను ఒకే సమయంలో ప్రారంభించాలని ఐపీఎల్‌ పాలకవర్గం నిర్ణయించింది. డబుల్‌ హెడర్‌లు ఉన్నప్పుడు ఒక మ్యాచ్‌ మధ్యాహ్నం (3.30), మరో మ్యాచ్‌ రాత్రి 7.30కు మొదలవుతాయి. చివరి మ్యాచ్‌లో పోటీ పడే జట్టుకు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశమున్నప్పుడు.. ఏ జట్టుకూ అవాంచిత ప్రయోజనం కలగకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు వేళల్లో మార్పులు చేశారు. చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌తో ముంబయి, బెంగళూరుతో దిల్లీ తలపడతాయి. రెండు కొత్త ఐపీఎల్‌ జట్లను అక్టోబరు 25న ప్రకటించనున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన