జ్యోతికకు స్వర్ణం.. నిత్యకు కాంస్యం

ప్రధానాంశాలు

Published : 29/09/2021 03:06 IST

జ్యోతికకు స్వర్ణం.. నిత్యకు కాంస్యం

దిల్లీ: జాతీయ అండర్‌-23 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో దండి శ్రీజ్యోతిక (ఆంధ్రప్రదేశ్‌) స్వర్ణం, నిత్య (తెలంగాణ) కాంస్య పతకాలతో మెరిశారు. మంగళవారం మహిళల 400 మీటర్ల పరుగును 53.05 సెకన్లలో ముగించిన జ్యోతిక అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫెడరేషన్‌ కప్‌ (53.57 సె), జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ (53.79 సె), అంతర్రాష్ట్ర టోర్నీ (53.29 సె)ల కంటే జ్యోతిక మెరుగైన ప్రదర్శన చేసింది. మహిళల 100 మీటర్ల పరుగును నిత్య 11.90 సెకన్లలో పూర్తిచేసి కాంస్యం నెగ్గింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన