రెండో స్థానంలో భారత్‌

ప్రధానాంశాలు

Published : 29/09/2021 03:06 IST

రెండో స్థానంలో భారత్‌

సిట్‌గెస్‌ (స్పెయిన్‌):  ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం మూడో రౌండ్లో మన బృందం 2.5-1.5తో బలమైన ఆర్మేనియాపై నెగ్గింది. తొలి గేమ్‌లో అనా సర్గియాన్‌పై తానియా సచ్‌దేవ్‌ 40 ఎత్తుల్లో గెలవగా.. సుసానాపై భక్తి కులకర్ణి 30 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. ఎలీనాతో గేమ్‌ను ద్రోణవల్లి హారిక డ్రా చేసుకోగా.. లీలిట్‌ చేతిలో యువ కెరటం వైశాలి ఓటమి చవిచూసింది. భారత్‌ 5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు రెండో రౌండ్లో భారత్‌ 2.5-1.5తో స్పెయిన్‌పై నెగ్గింది. తొలి రౌండ్లో మన బృందం 2-2తో అజర్‌బైజాన్‌తో డ్రా చేసుకుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన