ఓడినా.. గర్వంగా ఉంది

ప్రధానాంశాలు

Published : 15/10/2021 02:18 IST

ఓడినా.. గర్వంగా ఉంది

షార్జా: క్వాలిఫయర్‌-2లో కోల్‌కతా  చేతిలో ఓడిపోయినా తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నానని దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. తన సహచరులను గొప్ప పోరాటయోధులుగా అభివర్ణించాడు. ‘‘ఫలితం బాధ కలిగించేదే. కానీ పోరాట యోధులతో కూడిన జట్టును నడిపించినందుకు గర్వంగా ఉంది. ఈ సీజన్లో బాగా ఆడాం. కొన్నిసార్లు దెబ్బతిని ఉండొచ్చు. కానీ మేం శక్తివంచన లేకుండా కృషి చేశాం’’ అని పంత్‌ చెప్పాడు. ‘‘యజమానులు, మేనేజ్‌మెంట్‌, సహాయ సిబ్బంది, జట్టు సహచరులకు నా కృతజ్ఞతలు. మీరంతా ఈ సీజన్‌ను ఎంతో ప్రత్యేకమైందిగా మార్చారు. వచ్చే  సీజన్‌లో మరింత మెరుగైన ప్రదర్శన  చేస్తాం’’ అని పంత్‌ చెప్పాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన