భారత మహిళలు ఔట్‌

ప్రధానాంశాలు

Published : 15/10/2021 02:18 IST

భారత మహిళలు ఔట్‌

ఆహుస్‌ (డెన్మార్క్‌): ఉబెర్‌కప్‌లో భారత మహిళల జట్టు కథ ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో ఆ జట్టు జపాన్‌ చేతిలో పరాజయం పాలైంది. సింధు, సైనా లేని భారత జట్టు తేలిపోయింది. పోరులో 3-0 ఆధిక్యం సంపాదించిన జపాన్‌ మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సెమీఫైనల్లో ప్రవేశించింది. మొదట మాళవిక 12-21, 17-21తో ప్రపంచ నంబర్‌-5 యమగూచి చేతిలో ఓడిపోవడంతో జపాన్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తనీషా, రుతపర్ణ జంట  8-21, 10-21తో యుకి ఫుకుషిమ, మాయు మత్సుముటో జోడీ చేతి కంగుతింది. మూడో మ్యాచ్‌లో సయాక తకహషి 21-16, 21-7తో అదితి భట్‌ను ఓడించి.. అయిదు మ్యాచ్‌ల పోరులో జపాన్‌కు 3-0 ఆధిక్యాన్ని అందించింది.

థామస్‌కప్‌లో..: థామస్‌ కప్‌లో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్న భారత పురుషుల జట్టుకు గ్రూపు దశలో చివరి లీగ్‌ మ్యాచ్‌లో చుక్కెదురైంది. గురువారం జరిగిన గ్రూపు-సి పోరులో భారత్‌ 1-4తో చైనా చేతిలో ఓడింది. గ్రూపు దశలో నెదర్లాండ్స్‌, తాహిటిలపై విజయాలు నమోదు చేసిన భారత్‌.. 2010 తర్వాత తొలిసారిగా థామస్‌ కప్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌ పోరులో డెన్మార్క్‌తో తలపడుతుంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన