ఒమన్‌ శుభారంభం

ప్రధానాంశాలు

Published : 18/10/2021 01:25 IST

ఒమన్‌ శుభారంభం

పపువా న్యూ గినియాపై విజయం

అల్‌ అమెరాట్‌: టీ20 ప్రపంచకప్‌ను ఆతిథ్య దేశం ఒమన్‌ విజయంతో మొదలెట్టింది. ఆదివారం క్వాలిఫయర్‌ గ్రూప్‌- బి మ్యాచ్‌లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పపువా న్యూగినియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేసింది. స్కోరుబోర్డుపై ఒక్క పరుగైనా చేరకముందే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఆ జట్టును ఛార్లెస్‌ (37)తో కలిసి కెప్టెన్‌ అసద్‌ (56; 43 బంతుల్లో 4×4, 3×6) ఆదుకున్నాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 81 పరుగులు జత చేయడంతో జట్టు కోలుకున్నట్లే కనిపించింది. కానీ తిరిగి పుంజుకున్న ప్రత్యర్థి బౌలర్లు ఆ తర్వాత 16 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి జట్టును కట్టడి చేశారు. ఒమన్‌ కెప్టెన్‌ జీషన్‌ (4/20) బంతితో చెలరేగాడు. అనంతరం ఛేదనలో భారత సంతతి కుర్రాడు జతిందర్‌ (73 నాటౌట్‌; 42 బంతుల్లో 7×4, 4×6)తో పాటు మరో ఓపెనర్‌ అకీబ్‌ (50 నాటౌట్‌; 43 బంతుల్లో 5×4, 1×6) కూడా అజేయ అర్ధశతకాలతో సత్తాచాటడంతో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే ఒమన్‌ 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన