హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తేనే..

ప్రధానాంశాలు

Published : 18/10/2021 01:25 IST

హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తేనే..

దుబాయ్‌: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య వార్మప్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేస్తేనే టీ20 ప్రపంచకప్‌లో భారత తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. 2019లో వెన్నుకు శస్త్ర చికిత్స అయిన దగ్గర భారత్‌తో పాటు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్‌కు అతడు దాదాపు బౌలింగ్‌ చేయని నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘నెట్స్‌లో మాత్రమే కాదు వార్మప్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేస్తేనే హార్దిక్‌ పాండ్యకు భారత తుది జట్టులో చోటివ్వాలి. నెట్స్‌లో బౌలింగ్‌ చేయడానికి ప్రపంచకప్‌ లాంటి టోర్నీల్లో బాబర్‌ అజామ్‌ లాంటి నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌కు బంతులు వేయడానికి చాలా తేడా ఉంది. అందుకే ముందుగా అతడు నెట్స్‌తో పాటు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయాలి. 100 శాతం బౌలింగ్‌ చేయాలి. 115-120 కి.మీ వేగంతో బంతులేస్తే కష్టం’’ అని గౌతి చెప్పాడు. గత కొన్నేళ్లుగా ఒకటికి మించి గాయాలతో ఇబ్బందిపడిన పాండ్య.. శస్త్రచికిత్స తర్వాత బంతి వైపు చూడట్లేదు. తాజాగా ఐపీఎల్‌లో ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. ఫిట్‌నెస్‌ సరిగా లేకపోవడంతో కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడలేకపోయాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన