రన్నరప్‌ తరుణ్‌

ప్రధానాంశాలు

Published : 18/10/2021 01:25 IST

రన్నరప్‌ తరుణ్‌

నికోసియా: సైప్రస్‌ అంతర్జాతీయ ఫ్యూచర్‌ సిరీస్‌ 2021 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ కుర్రాడు తరుణ్‌ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. ఐరోపాలో జరిగిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో తరుణ్‌ 20-22, 21-9, 11-21 తేడాతో దిమిత్రి పెనరిన్‌ (కజకిస్థాన్‌) చేతిలో పోరాడి ఓడాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో గట్టి పోటీనిచ్చిన తరుణ్‌.. చివర్లో తడబడి గెలుపు దూరం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో బలంగా పుంజుకుని ప్రత్యర్థిని చిత్తుచేసిన అతను.. మూడో గేమ్‌లో మాత్రం ఆ జోరు చూపించలేకపోయాడు. ప్రత్యర్థి ముందు తలవంచాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన