Yuvraj Singh: యువరాజ్‌ అరెస్టు, విడుదల

ప్రధానాంశాలు

Updated : 18/10/2021 09:15 IST

Yuvraj Singh: యువరాజ్‌ అరెస్టు, విడుదల

హిసార్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఒక కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆదివారం అరెస్ట్‌ అయిన అతడు.. వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. నిరుడు జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ వీడియోలో క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌తో మాట్లాడుతూ కుల వివక్ష వ్యాఖ్యలు చేశాడన్నది అతడిపై ఆరోపణ. పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం యువీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడిని పూచీకత్తుపై వదిలిపెట్టారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన