గెలవడానికే వస్తున్నాం

ప్రధానాంశాలు

Published : 18/10/2021 01:25 IST

గెలవడానికే వస్తున్నాం

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా బరిలో దిగుతోందని ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ చెప్పాడు. జట్టులో ఎక్కువమందికి అనుభవం లేకపోయినా.. పూర్తి స్థాయి బృందంతో ఈసారి బరిలో దిగుతున్నామని అతడు తెలిపాడు. ‘‘ఆస్ట్రేలియా జట్టులో కుర్రాళ్లు ఎక్కువమంది ఉన్నారు. అనుభవం కూడా తక్కువే. కొంతమంది తొలిసారి ఆసీస్‌కు ఆడుతున్నారు. విదేశీ గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో మా జట్టు కొన్ని అడ్డంకుల్ని అధిగమించాల్సి ఉంది. ఎందుకంటే ఆసీస్‌ ఆటగాళ్లలో చాలామందికి ప్రాక్టీస్‌ లేదు. కరోనా నేపథ్యంలో సిడ్నీ, మెల్‌బోర్న్‌లో ఇప్పటికి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున సాధన సాగలేదు. అయితే ప్రపంచకప్‌కు పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉండడం ఒక్కటే మాకు సానుకూలాంశం. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఆడిన కొంతమంది ఆటగాళ్ల కూడా జట్టులో ఉన్నారు. ఇప్పటి వరకు ఆసీస్‌ టీ20 ప్రపంచకప్‌ గెలవలేదు. ఈసారి గెలవడానికే వస్తున్నాం’’ అని స్టార్క్‌ పేర్కొన్నాడు. అక్టోబర్‌ 23న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో ఆసీస్‌ ప్రపంచకప్‌ సమరాన్ని మొదలుపెట్టనుంది. గత ఆరు టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో కంగారూ జట్టు ఒకే ఒక్కసారి (2010) మాత్రమే ఫైనల్లో అడుగుపెట్టగలిగింది. అయితే అప్పుడు ఇంగ్లాండ్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన