సూపర్‌-12కు చేరువలో స్కాట్లాండ్‌

ప్రధానాంశాలు

Published : 20/10/2021 04:10 IST

సూపర్‌-12కు చేరువలో స్కాట్లాండ్‌

పపువా న్యూ గినియాపైనా విజయం

అల్‌ అమెరాట్‌: టీ20 ప్రపంచకప్‌ తొలి రౌండ్లో తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్‌.. రెండో మ్యాచ్‌లోనూ నిలకడను కొనసాగించింది. మంగళవారం ఆ జట్టు గ్రూప్‌-బిలో పపువా న్యూ గినియాను 17 పరుగుల తేడాతో ఓడించి సూపర్‌-12 అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. రిచీ బెరింగ్టన్‌ (70; 49 బంతుల్లో 6×4, 3×6), మాథ్యూ క్రాస్‌ (45; 36 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. 26 పరుగులకే 2 వికెట్లు పడ్డ స్థితిలో బెరింగ్టన్‌, క్రాస్‌ మూడో వికెట్‌కు 92 పరుగులు చేసి జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. అయితే చివరి ఓవర్లలో స్కాట్లాండ్‌.. మోరియా (4/31), సోపర్‌ (3/24)ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసింది. అనంతరం డేవీ (4/18) విజృంభించడంతో పపువా న్యూ గినియా బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు. ఒక దశలో 67 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. అయితే వనువా (47), బవు (24), డొరిగా (18) పోరాడటంతో పపువా న్యూ గినియా గౌరవప్రదంగా ఓడింది. గ్రూప్‌లో తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌.. ఒమన్‌ను ఢీకొంటుంది.


టీ20 ప్రపంచకప్‌లో ఈనాడు
నెదర్లాండ్స్‌ × నమీబియా  మ।। 3.30 నుంచి
శ్రీలంక × ఐర్లాండ్‌        రాత్రి 7.30 నుంచి


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన