షకిబ్‌ ఆల్‌రౌండ్‌ జోరు

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:04 IST

షకిబ్‌ ఆల్‌రౌండ్‌ జోరు

ఒమన్‌పై బంగ్లా గెలుపు

అల్‌మెరాట్‌: టీ20 ప్రపంచకప్‌ తొలి రౌండ్లో బంగ్లాదేశ్‌ తొలి విజయాన్నందుకుంది. గ్రూప్‌-బిలో తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ చేతిలో కంగుతిన్న ఆ జట్టు.. మంగళవారం ఒమన్‌పై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బంగ్లాదేశ్‌ సరిగ్గా 20 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్‌ నయీమ్‌ (64; 50 బంతుల్లో 3×4, 4×6), షకిబ్‌ అల్‌హసన్‌ (42; 29 బంతుల్లో 6×4) మినహా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఒమన్‌ బౌలర్లలో బిలాల్‌ ఖాన్‌ (3/18), ఫయాజ్‌ బట్‌ (3/30), కలీముల్లా (2/30) సత్తా చాటారు. అనంతరం షకిబ్‌ (3/28) బంతితోనూ రాణించడం.. ముస్తాఫిజర్‌ (4/29) కూడా విజృంభించడంతో ఒమన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది. జతిందర్‌ సింగ్‌ (40) మినహా ఒమన్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. గ్రూప్‌లో తమ చివరి మ్యాచ్‌లో బంగ్లా.. పపువా న్యూ గినియాను ఢీకొనబోతోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన