హర్భజన్‌, శ్రీనాథ్‌కు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం

ప్రధానాంశాలు

Published : 20/10/2021 04:13 IST

హర్భజన్‌, శ్రీనాథ్‌కు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం

లండన్‌: భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, మాజీ పేసర్‌ జగవళ్‌ శ్రీనాథ్‌కు  మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) జీవితకాల సభ్యత్వం లభించింది. ఈ ఏడాదికి గాను 18 మంది క్రికెటర్లకు మంగళవారం ఈ గౌరవాన్ని ప్రకటించగా.. అందులో భజ్జీ, శ్రీనాథ్‌ చోటు దక్కించుకున్నారు. 103 టెస్టుల్లో 417 వికెట్లు తీసిన భజ్జీ.. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిసి ఈ ఆఫ్‌స్పిన్నర్‌ 700కి పైగా వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ప్రస్తుతం ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ మ్యాచ్‌ రిఫరీగా ఉన్న శ్రీనాథ్‌ తన కెరీర్‌లో వన్డేల్లో 315, టెస్టుల్లో 236 వికెట్లు తీశాడు. ‘‘టెస్టులు ఆడే 12 దేశాలకు గాను ఎనిమిది దేశాల నుంచి క్రికెటర్లు ఈ ఏడాది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఆధునిక క్రికెట్లో దిగ్గజాలుగా ఎదిగిన వాళ్లూ అందులో ఉన్నారు’’ అని క్రికెట్‌ చట్టాల సంరక్షణ బాధ్యతలు చూసుకునే ఎంసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. కుక్‌, ఇయాన్‌ బెల్‌, ట్రెస్కోతిక్‌, సారా టేలర్‌ (ఇంగ్లాండ్‌), ఆమ్లా, గిబ్స్‌, కలిస్‌, మోర్కెల్‌ (దక్షిణాఫ్రికా), మహిళా బ్యాటర్‌ అలెక్స్‌, మార్టీన్‌ (ఆస్ట్రేలియా), బిషప్‌, చందర్‌పాల్‌, రామ్‌నరేశ్‌ (వెస్టిండీస్‌), రంగనా హెరాత్‌ (శ్రీలంక), సారా మెక్‌గ్లాషన్‌ (న్యూజిలాండ్‌), గ్రాంట్‌ ఫ్లవర్‌ (జింబాబ్వే) ఈ సారి జీవిత కాల సభ్యత్వాన్ని అందుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన