ధోని లేని సీఎస్కే లేదు..

ప్రధానాంశాలు

Published : 20/10/2021 04:15 IST

ధోని లేని సీఎస్కే లేదు..

చెన్నై: ధోని.. చెన్నై సూపర్‌కింగ్స్‌లో అంతర్భాగమని, అతడు లేని సీఎస్కే లేదని ఆ ఫ్రాంఛైజీ యజమాని శ్రీనివాసన్‌ అన్నాడు. ‘‘ధోని సీఎస్కేలో అంతర్భాగం. ధోని లేని సీఎస్కే లేదు.. సీఎస్కే లేని ధోని లేడు’’ అని చెప్పాడు. ధోని వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతాడా లేడా అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే ఏదో ఒక హోదాలో చెన్నై జట్టుతో ఉంటాడని మాత్రం స్పష్టమవుతోంది. ధోని ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి, అంటే 2008 నుంచి చెన్నై కెప్టెన్‌గా ఉంటున్నాడు. ‘‘వచ్చే సీజన్‌లో చెన్నై తరఫున ఆడతానో లేదో తెలియదు కానీ.. నన్ను మీరు పసుపు దుస్తుల్లో మాత్రం చూస్తారు’’ అని ఐపీఎల్‌ 2021 సందర్భంగా ధోని చెప్పాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన