సూపర్‌ 12కు శ్రీలంక

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

సూపర్‌ 12కు శ్రీలంక

ఐర్లాండ్‌పై ఘనవిజయం

అబుదాబి: శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో లంక 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. హసరంగ డిసిల్వా (71; 47 బంతుల్లో 10×4, 1×6), నిశాంక (61; 47 బంతుల్లో 6×4, 1×6) చెలరేగడంతో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. శ్రీలంక ఆరంభం పేలవం. రెండు ఓవర్లలో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆ స్థితిలో హసరంగ, నిశాంక జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో జోష్‌ లిటిల్‌ (4/23) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఛేదనలో ఐర్లాండ్‌ 18.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. తీక్షణ (3/17), చమిక (2/27), లహిరు కుమార (2/22) ఐర్లాండ్‌ పతనాన్ని శాసించారు. బల్‌బిర్నీ (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో లంక.. ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆ జట్టు.. నాలుగు జట్ల గ్రూప్‌-ఎలో అగ్రస్థానంలో ఉంది. రెండేసి మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్‌, నమీబియా ఒక్కో మ్యాచ్‌ నెగ్గాయి. తమ చివరి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి. కాబట్టి ఏదో ఒక జట్టుకే రెండు మ్యాచ్‌లు గెలిచే అవకాశముంటుంది. అంటే రెండింటి మధ్య జరిగేది నాకౌట్‌ మ్యాచ్‌ అన్నమాట. నెదర్లాండ్స్‌ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి సూపర్‌ 12 రేసు నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ముందంజ వేస్తాయి. రెండు గ్రూపుల నుంచి మొత్తం నాలుగు జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన