గ్రూప్‌-బిలో బెర్తులెవరివో?

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

గ్రూప్‌-బిలో బెర్తులెవరివో?

నేడు పపువా న్యూ గినియాతో బంగ్లా, ఒమన్‌తో స్కాట్లాండ్‌ ఢీ

అల్‌మెరాట్‌: ప్రపంచకప్‌ ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించే దిశగా కీలక సమరాలకు బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ సిద్ధమయ్యాయి. గ్రూప్‌-బిలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పపువా న్యూ గినియా ముందంజ వేసే అవకాశాలు లేనట్లే. బంగ్లా, స్కాట్లాండ్‌లతో పాటు ఒమన్‌ కూడా ప్రధాన రౌండుకు రేసులోనే ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన స్కాట్లాండ్‌.. సూపర్‌-12 బెర్తుకు చేరువలోనే ఉంది. కానీ గురువారం ఒమన్‌ను ఓడిస్తేనే ఆ జట్టు ముందంజ వేస్తుంది. ఈ మ్యాచ్‌ ఓడితే మాత్రం ఆ జట్టుకు కష్టమే. పపువా న్యూ గినియాపై ఘనవిజయం సాధించి, బంగ్లాదేశ్‌పై తక్కువ తేడాతో ఓడిన ఒమన్‌.. నెట్‌ రన్‌రేట్‌లో (+0.613) స్కాట్లాండ్‌ (+0.575) కన్నా మెరుగ్గా ఉంది. స్కాట్లాండ్‌ చేతిలో ఓడి, ఒమన్‌పై నెగ్గిన బంగ్లాదేశ్‌ (+0.500).. అద్భుతం జరిగితే తప్ప చివరి మ్యాచ్‌లో పపువా న్యూ గినియాను ఓడించి ముందంజ వేసే అవకాశాలే ఎక్కువ. ఆ స్థితిలో చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓడితే.. బంగ్లాతో పాటు ఒమన్‌ ప్రధాన రౌండుకు అర్హత సాధిస్తుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన