టీకా వేసుకుంటేనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు అనుమతి

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

టీకా వేసుకుంటేనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు అనుమతి

కాన్‌బెరా: టెన్నిస్‌ క్రీడాకారులు తప్పనిసరిగా కొవిడ్‌-19 టీకా తీసుకోవాలని, లేదంటే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరం కావాల్సి వస్తుందని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. టీకా వేసుకోవడాన్ని ఆటగాళ్ల ఇష్టానికి వదిలేయాలని ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ ఇంతకుముందు వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా క్రీడల మంత్రి.. గ్రెగ్‌ హంట్‌ మాత్రం తమ దేశంలో అడుగుపెట్టాలంటే నిబంధనల ప్రకారం రెండు టీకాలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘‘ఆటగాడు ప్రపంచ నంబర్‌వన్‌ కావొచ్చు లేదా ఇంకేమైనా కావొచ్చు.. ఆస్ట్రేలియా ప్రజలను రక్షించడం కోసం విధించిన నిబంధనలు అందరికీ వర్తిస్తాయి’’ అని అన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన