ఫీల్డింగ్‌ కోచ్‌ రేసులో అభయ్‌ శర్మ

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

ఫీల్డింగ్‌ కోచ్‌ రేసులో అభయ్‌ శర్మ

దిల్లీ: టీమ్‌ ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి అభయ్‌ శర్మ దరఖాస్తు చేయనున్నాడు. 52 ఏళ్ల అభయ్‌ భారత్‌-ఎ, అండర్‌-19, భారత మహిళల జట్టుతో కలిసి పనిచేశాడు. భారత జట్టు ప్రస్తుత ఫీల్డింగ్‌ కోచ్‌ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనున్న సంగతి తెలిసిందే. ‘‘అభయ్‌.. ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోబోతున్నాడు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నవంబరు 3. అభయ్‌ శర్మ 89 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 2016లో జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. అదే భారత జట్టుతో పాటు అమెరికా, వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాడు. ఎన్‌సీఏ సహాయ సిబ్బందిలో ఒకడైన అభయ్‌.. దాని అధిపతి రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి పనిచేశాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన