T20 World Cup: విండీస్‌కు ఎదురుందా!

ప్రధానాంశాలు

Updated : 22/10/2021 07:17 IST

T20 World Cup: విండీస్‌కు ఎదురుందా!

ఎవరి సత్తా ఎంత?

2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ గుర్తుందా..! ఇంగ్లాండ్‌తో జరిగిన తుది సమరంలో ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరమైతే.. స్టోక్స్‌ బౌలింగ్‌లో వరుసగా నాలుగు భారీ సిక్స్‌లు బాది వెస్టిండీస్‌ను విజేతగా నిలిపాడు కార్లోస్‌ బ్రాత్‌వైట్‌! ఈ ఒక్క సంఘటన చాలు.. టీ20ల్లో కరీబియన్‌ జట్టు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి! ఈసారి     ప్రపంచకప్‌లోనూ ఆ జట్టు అంతే ప్రమాదకరం. ఒకరా ఇద్దరా నిండా హిట్టర్లే.. దాదాపు అంతా మ్యాచ్‌ విన్నర్లే! ఏ స్థితిలోనైనా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేసే మొనగాళ్లే! ఇప్పటికే రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన కరీబియన్‌ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో పొలార్డ్‌ సారథ్యంలో మూడోసారి వేటకు బయల్దేరింది.

ఈనాడు క్రీడావిభాగం

వెస్టిండీస్‌ అనగానే గుర్తొచ్చేది వాళ్ల హార్డ్‌ హిట్టింగే. గేల్‌, పొలార్డ్‌, రసెల్‌, లూయిస్‌, సిమన్స్‌ ఒక్కరేంటి ఓపెనర్‌ నుంచి టెయిలెండర్ల వరకు బాదుడుగాళ్లే. అందులోనూ ఎక్కువమంది ఆల్‌రౌండర్లే. వీళ్లే వెస్టిండీస్‌ ప్రధాన బలం. ముఖ్యంగా టీ20ల్లో ఛేదనలో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేయడం అంత తేలికేం కాదు. వికెట్లు పడుతున్నా వారు మాత్రం హిట్టింగ్‌ ఆపరు. గేల్‌, సిమన్స్‌, రసెల్‌, లూయిస్‌ లాంటి వాళ్లు కుదురుకుంటే ఏ జట్టుకైనా చుక్కలే. ఇప్పుడు పెద్దగా ఫామ్‌లో లేకపోయినా అనూహ్యంగా చెలరేగే యూనివర్స్‌ బాస్‌ గేల్‌ను అడ్డుకోవడం అత్యంత కష్టం. వీరికి ముక్కుతాడు వేసినా ఆల్‌రౌండర్లు పొలార్డ్‌, బ్రావో, రసెల్‌ను ఆపితేనే ఆ జట్టును నియంత్రించే అవకాశం ఉంటుంది.

బౌలింగ్‌ వైవిధ్యం: బౌలింగ్‌లోనూ విండీస్‌ వైవిధ్యంగా ఉంది. రసెల్‌, బ్రావో, పొలార్డ్‌ లాంటి భిన్నమైన పేసర్లతో పాటు రవిరాంపాల్‌ లాంటి స్ట్రయిక్‌ బౌలర్లు ఆ జట్టు సొంతం. ఇక ఐపీఎల్‌లో చెన్నై తరఫున రాణించిన డ్వేన్‌ బ్రావో.. యూఏఈ పిచ్‌లకు బాగా అలవాటుపడ్డాడు. అతడి శైలి స్లో బౌలింగ్‌కు ఈ పిచ్‌లు బాగా సరిపోతాయి. డెత్‌ బౌలింగ్‌ స్పెషలిస్టులు పొలార్డ్‌, రసెల్‌ ఆ జట్టుకు ప్రధాన అండ. ఇటీవల యూఏఈలో ముగిసిన ఐపీఎల్‌లో ఎక్కువమంది ఆడిన అనుభవం ఉండడం కరీబియన్‌ జట్టుకు కలిసొచ్చే మరో అంశం. అయితే ఎంతమంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నా.. హిట్టర్లు ఉన్నా కూడా కలిసికట్టుగా రాణించకపోవడం ఆ జట్టుకు ప్రధాన లోపం. బ్యాటింగ్‌ పక్కనపెడితే ఉపఖండ పిచ్‌లపై బౌలింగ్‌లో గొప్ప రికార్డు లేకపోవడం కరీబియన్‌ జట్టు లోపాల్లో ఇంకోటి. కానీ కలిసికట్టుగా రాణిస్తే కప్‌ గెలవడం ఆ జట్టుకు కష్టం కాబోదు.

* ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి జట్లతో కలిసి గ్రూప్‌-1లో ఉన్న వెస్టిండీస్‌ సత్తా చాటితే సెమీస్‌ చేరడం పక్కా.


కీలక ఆటగాళ్లు:  గేల్‌, పొలార్డ్‌, రసెల్‌, డ్వేన్‌ బ్రావో

అత్యుత్తమ ప్రదర్శన: ఛాంపియన్‌ 2012, 2016

వెస్టిండీస్‌ జట్టు: పొలార్డ్‌ (కెప్టెన్‌), పూరన్‌ (వైస్‌ కెప్టెన్‌), హోసెన్‌, డ్వేన్‌ బ్రావో, ఛేజ్‌, ఫ్లెచర్‌, గేల్‌, హెట్‌మయర్‌, ఇవిన్‌ లూయిస్‌, మెక్‌కే, సిమన్స్‌, రవి రాంపాల్‌, రసెల్‌, ఒషాన్‌ థామస్‌, హేడెన్‌ వాల్ష్‌ జూనియర్‌.

రిజర్వ్‌లు: డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, జాసన్‌ హోల్డర్‌, మోటీ
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన