ఆ జట్టు మ్యాచ్‌ విన్నర్లకు నెలవు

ప్రధానాంశాలు

Published : 22/10/2021 03:00 IST

ఆ జట్టు మ్యాచ్‌ విన్నర్లకు నెలవు

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచకప్‌ బరిలో   నిలిచిన భారత జట్టులో చాలా మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారని ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. వార్మప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో గెలిచిన నేపథ్యంలో స్మిత్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘భారత్‌ బలమైన జట్టు. అన్ని రంగాల్లో ఆ జట్టు దుర్భేద్యంగా ఉంది. ఒకరికి మించి మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. గత రెండు నెలలుగా యూఏఈ వాతావరణంలో టీమ్‌ఇండియా ఆడుతోంది. ఇక్కడ పరిస్థితులకు ఆ జట్టు ఆటగాళ్లు బాగా అలవాటుపడ్డారు’’ అని స్మిత్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినా భారత్‌తో వార్మప్‌ పోరులో రాణించడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన