ఎవరిదో ఆఖరి బెర్తు

ప్రధానాంశాలు

Published : 22/10/2021 03:00 IST

ఎవరిదో ఆఖరి బెర్తు

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో ప్రధాన టోర్నీకి బెర్తు సాధించేందుకు ఐర్లాండ్‌, నమీబియాకు ఆఖరి అవకాశం! సూపర్‌-12కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన గ్రూప్‌-ఏ పోరులో శుక్రవారం ఐర్లాండ్‌, నమీబియా తలపడనున్నాయి. క్వాలిఫయింగ్‌ దశలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు శ్రీలంక చేతిలో ఓడి.. నెదర్లాండ్స్‌పై నెగ్గడం ద్వారా రెండేసి పాయింట్లు సాధించాయి. గ్రూప్‌-ఏ నుంచి ఇప్పటికే శ్రీలంక   (4 పాయింట్లు) ముందంజ వేయగా.. మిగిలిన రెండో బెర్తు దక్కించుకోవడం కోసం ఐర్లాండ్‌, నమీబియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

రెండు జట్ల బలాబలాలు, అనుభవాన్ని లెక్క వేసుకుంటే నమీబియాపై ఐర్లాండ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అయితే తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న నమీబియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నెదర్లాండ్స్‌పై 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన తీరే ఇందుకు నిదర్శనం. ఈ ఫార్మాట్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక ఛేదన.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన