ఆ నిర్ణయం పూర్తిగా కోహ్లిదే: గంగూలీ

ప్రధానాంశాలు

Published : 23/10/2021 03:42 IST

ఆ నిర్ణయం పూర్తిగా కోహ్లిదే: గంగూలీ

దుబాయ్‌: టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలనుకోవడం పూర్తిగా విరాట్‌ కోహ్లి సొంత నిర్ణయమేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 కెప్టెన్‌గా తప్పుకోవాలనుకున్న కోహ్లి నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంగ్లాండ్‌ సిరీస్‌ తర్వాత అతడికి ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఇది పూర్తిగా అతడి సొంతం నిర్ణయం. మేం విరాట్‌తో మాట్లాడలేదు. అతడిపై ఎలాంటి ఒత్తిడి తీసుకు రాలేదు. నేను కూడా ఒకప్పుడు ఆటగాడినే. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయను. సుదీర్ఘ కాలం ఒక ఆటగాడు ఒకటికి మించి ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండడం చాలా కష్టం. అంతర్గతంగా పడే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇది ఏ కెప్టెన్‌కైనా వర్తిస్తుంది’’ అని దాదా చెప్పాడు. ఏ బ్యాట్స్‌మెన్‌కైనా కలిసిరాని కాలం ఉంటుందని.. ఇప్పుడు విరాట్‌కు అదే నడుస్తుందని.. అతడు కూడా మనిషేనని.. యంత్రం కాదని సౌరభ్‌ అన్నాడు. గతంలో కోచ్‌ పదవికి సంప్రదించినప్పుడు ద్రవిడ్‌ ఆసక్తి ప్రదర్శించలేదని..ఇప్పుడు అతడెలా స్పందిస్తాడో చూడాలని దాదా చెప్పాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన