నమీబియా వచ్చేసింది

ప్రధానాంశాలు

Published : 23/10/2021 03:56 IST

నమీబియా వచ్చేసింది

షార్జా: తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న నమీబియా సూపర్‌-12 దశకు అర్హత సాధించింది. శుక్రవారం తప్పక గెలవాల్సిన గ్రూప్‌-ఏ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో టెస్టు హోదా ఉన్న ఐర్లాండ్‌కు షాకిచ్చింది. మొదట ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు స్టిర్లింగ్‌ (38), కెవిన్‌ ఓబ్రైన్‌ (25) మినహా బ్యాటర్లు తేలిపోయారు. ఫ్రైలింక్‌ (3/21), డేవిడ్‌ వీజ్‌ (2/22) ప్రత్యర్థిని కట్టడి చేశారు. గ్రీన్‌ (24), వీజ్‌ (28 నాటౌట్‌) సాయంతో  కెప్టెన్‌ ఎరాస్మస్‌ (53 నాటౌట్‌) జట్టుకు విజయాన్ని అందించాడు. నమీబియా 18.3 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే ఇప్పటికే సూపర్‌-12 బెర్తు ఖరారు చేసుకున్న శ్రీలంక (3 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు) తన చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి గ్రూప్‌-ఏలో నంబర్‌వన్‌ జట్టుగా నిలిచింది. 3 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. ఒక మ్యాచ్‌లో ఓడిన నమీబియా 4 పాయింట్లతో రెండో స్థానం సాధించింది.

ఎవరు ఎక్కడ

గ్రూప్‌-1 : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక
గ్రూప్‌-2 : భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన