అప్పుడు బౌలింగ్‌ చేస్తా

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

అప్పుడు బౌలింగ్‌ చేస్తా

దుబాయ్‌: 2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్న టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. తాను తిరిగి ఎప్పుడు బంతి పట్టుకునేది వెల్లడించాడు. ఈ టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ దశకు చేరువయ్యే సమయంలో తాను బౌలింగ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. ‘‘గతంలో చికాకు తెప్పించిన నా వెన్నెముక ఇప్పుడు బాగుంది. కానీ ఇప్పుడే బౌలింగ్‌ చేయలేను. నాకౌట్‌ దశ కంటే ముందే బంతి పట్టుకోవాలనుకుంటున్నా. ఎప్పుడు బౌలింగ్‌ చేస్తాననే విషయంపై నిపుణులతో కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా అధిక ప్రచారాన్ని కోరుకోలేదు. నా కుటుంబం కూడా అదే అనుకుంది. ఉత్తేజితమయ్యే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నా. భావోద్వేగాలను పక్కనపెట్టి ప్రొఫెషనల్స్‌లా ఆడాలి’’ అని పాండ్య పేర్కొన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన