రెండు సార్లు కప్పు గెలిచాం.. మరి ఇప్పుడు?

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

రెండు సార్లు కప్పు గెలిచాం.. మరి ఇప్పుడు?

పాక్‌తో మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ల వ్యక్తిగత స్కోర్లు ఒక అంకెకే పరిమితమయ్యాయి. గతంలోనూ రెండు సార్లు ఇలాగే జరిగినప్పుడు టీమ్‌ఇండియా టైటిళ్లు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో గ్రూప్‌ మ్యాచ్‌లో అప్పటి భారత ఓపెనర్లు గంభీర్‌, సెహ్వాగ్‌ వరుసగా 0, 5 పరుగులు మాత్రమే చేశారు. కానీ అదే టోర్నీ ఫైనల్లో పాక్‌పైనే గెలిచిన టీమ్‌ఇండియా తొలి టీ20 ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక 2016 ఆసియా కప్‌లోనూ దాయాదితో పోరులో భారత్‌ ఓపెనర్లు రోహిత్‌, రహానె డకౌట్‌ అయ్యారు. ఆ టోర్నీలోనూ మన జట్టు విజేతగా నిలిచింది. మరి ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లోనూ అదే ఫలితం పునరావృతం అవుతుందేమో చూడాలి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన