నేటి నుంచే ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:25 IST

నేటి నుంచే ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

బెల్‌గ్రేడ్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తాచాటేందుకు భారత బాక్సర్లు సిద్ధమయ్యారు. సోమవారం ఆరంభమయ్యే ఈ ఛాంపియన్‌షిప్స్‌లో.. గత టోర్నీలో సాధించిన రెండు పతకాల ప్రదర్శనను అధిగమించాలనే పట్టుదలతో ఉన్నారు. 2019 ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచి ఆ ఘనత సాధించిన తొలి భారత బాక్సర్‌గా నిలిచిన అమిత్‌ పంగాల్‌, కాంస్యం నెగ్గిన మనీశ్‌ కౌశిక్‌ ఈ సారి పోటీలో లేరు. ప్రస్తుత జట్టులో శివ తాపా (63.5 కేజీలు)కు మాత్రమే గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తలపడ్డ అనుభవం ఉంది. అతనితో పాటు దీపక్‌ (51 కేజీలు), సంజీత్‌ (92 కేజీలు), రోహిత్‌ (57 కేజీలు)పై ఇప్పుడు మంచి అంచనాలున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన