రోహిత్‌ను తొలగిస్తారా?

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 07:37 IST

రోహిత్‌ను తొలగిస్తారా?

పాక్‌తో మ్యాచ్‌ అనంతరం విలేకర్ల సమావేశంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషాన్‌ కోసం జట్టులో నుంచి రోహిత్‌ శర్మను తప్పిస్తారా? అనే ప్రశ్న వినపడగానే కోహ్లి నమ్మశక్యం కానట్లు చూశాడు. ‘‘ఇదో ధైర్యమైన ప్రశ్న. అసలు మీరేం అనుకుంటున్నారు? నాకు ఉత్తమం అనిపించిన జట్టుతో ఆడా. మీ అభిప్రాయం ఏమిటీ? అంతర్జాతీయ టీ20ల నుంచి రోహిత్‌ను మీరు తప్పించగలరా? చివరగా మేం ఆడిన టీ20 మ్యాచ్‌లో అతని ప్రదర్శన గురించి తెలుసా? ఇది నమ్మశక్యంగా లేదు. మీకు వివాదం కావాలంటే ముందే చెప్పండి. అందుకు తగిన సమాధానమిస్తా’’ అని కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ డకౌటయ్యాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో ఓ టీ20లో రోహిత్‌ 64 పరుగుల ప్రదర్శనను ఈ సందర్భంగా కోహ్లి గుర్తు చేశాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన