యాషెస్‌కు ఇంగ్లాండ్‌ జట్టులో స్టోక్స్‌

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 07:41 IST

యాషెస్‌కు ఇంగ్లాండ్‌ జట్టులో స్టోక్స్‌

లండన్‌: మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టేందుకు క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం తీసుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. యాషెస్‌ సిరీస్‌లో పోటీపడే ఇంగ్లాండ్‌ జట్టులో అతణ్ని చేర్చారు. స్టోక్స్‌ మానసిక ఆరోగ్యం, వేలి గాయం నుంచి కోలుకోవడం కోసం జులై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ‘‘మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టేందుకు, వేలి గాయం నుంచి కోలుకునేందుకు విరామం తీసుకున్నా. ఇప్పుడు నా సహచరులతో చేరాలనే ఉత్సాహంతో ఉన్నా. ఆస్ట్రేలియా పర్యటనకు నేను సిద్ధం’’ అని స్టోక్స్‌ అన్నాడు. తిరిగి సాధన మొదలెట్టడానికి ఇంగ్లాండ్‌ వైద్య బృందం స్టోక్స్‌కు అనుమతిచ్చింది. భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఆడని 30 ఏళ్ల స్టోక్స్‌.. టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. యాషెస్‌కు స్టోక్స్‌ అందుబాటులోకి రావడం తమకు గొప్ప శుభ వార్త అని ఈసీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ అన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన