నిఖత్‌, నిహారికలకు పతకాలు ఖాయం

ప్రధానాంశాలు

Published : 26/10/2021 02:57 IST

నిఖత్‌, నిహారికలకు పతకాలు ఖాయం

హిసార్‌ (హరియాణా): జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్‌ జరీన్‌, నిహారిక గోనెళ్ల పతకాలు ఖాయం చేసుకున్నారు. 50-52 కేజీల విభాగంలో నిఖత్‌, 63-66 కేజీలలో నిహారిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌ 5-0తో మంజు బసుమంతరి (అసోం)పై, నిహారిక 5-0తో బబిత బిస్త్‌ (ఉత్తరాఖండ్‌)పై నెగ్గి కనీసం కాంస్యాలు ఖాయం చేసుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన