పంకజ్‌కు అగ్రస్థానం

ప్రధానాంశాలు

Published : 26/10/2021 02:57 IST

పంకజ్‌కు అగ్రస్థానం

ముంబయి: స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అడ్వాణీ ప్రపంచ స్నూకర్‌ క్వాలిఫయర్స్‌ను అగ్రస్థానంతో ముగించాడు. 36 ఏళ్ల పంకజ్‌ ఆడిన 12 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాడు. అతడు మొత్తం 10,760 పాయింట్లు సంపాదించాడు. 10,156 పాయింట్లతో ఆదిత్య మెహతా రెండో స్థానంలో నిలిచాడు. పంకజ్‌, ఆదిత్యలు ఇద్దరూ నవంబరు లేదా డిసెంబరులో జరిగే ప్రపంచ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించారు. ‘‘భారత్‌ నుంచి నంబర్‌వన్‌గా ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం’’ అని పంకజ్‌ వ్యాఖ్యానించాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన