మార్‌క్రమ్‌ ధనాధన్‌

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

మార్‌క్రమ్‌ ధనాధన్‌

నార్జ్‌ సూపర్‌ బౌలింగ్‌
విండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం
దుబాయ్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ ఇక నాకౌట్‌ చేరడం కష్టమే. పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ ఆ జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. విండీస్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది.

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. బంతితో నార్జ్‌, బ్యాటుతో మార్‌క్రమ్‌ (51 నాటౌట్‌; 26 బంతుల్లో 2×4, 4×6) మెరవడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. నార్జ్‌ (1/14)తో పాటు ప్రిటోరియస్‌ (3/17), కేశవ్‌ (2/24), రబాడ (1/27) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట విండీస్‌ 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. లూయిస్‌ (56; 35 బంతుల్లో 3×4, 6×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మార్‌క్రమ్‌, డసెన్‌ (43 నాటౌట్‌; 51 బంతుల్లో 3×4), హెండ్రిక్స్‌ (39; 30 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఛేదన ఆరంభంలోనే దక్షిణాఫ్రికాకు షాక్‌ తగిలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ బవుమా (2) రనౌటయ్యాడు. హెండ్రిక్స్‌, డసెన్‌ రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే పరుగులు వేగంగా రాలేదు. పదో ఓవర్లో హెండ్రిక్స్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 61 పరుగులు. ఆ తర్వాత డసెన్‌, మార్‌క్రమ్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. డసెన్‌ ఓ వైపు నిలబడగా.. మరోవైపు మార్‌క్రమ్‌ చెలరేగిపోయాడు. ఈ జంట సమీకరణాన్ని ఆరు ఓవర్లలో 44 పరుగులకు తీసుకొచ్చింది. మార్‌క్రమ్‌ ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించడంతో విండీస్‌కు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. నార్జ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది

వెస్టిండీస్‌ కట్టడి: మొదట విండీస్‌ భారీ స్కోరు సాధించే అవకాశాన్ని వృథా చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఓపెనర్‌ లూయిస్‌ చెలరేగడంతో  10.2 ఓవర్లలో 73/0తో బలమైన స్థితిలో నిలిచింది. కానీ లూయిస్‌ను రబాడ బౌల్డ్‌ చేశాక విండీస్‌ ఇన్నింగ్స్‌ గతి తప్పింది. ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పరుగుల వేటలో వెనుకబడిపోయింది. నార్జ్‌.. ఇతర బౌలర్లు కట్దుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో విండీస్‌ చివరి 8 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 57 పరుగులే చేయగలిగింది. నార్జ్‌ 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. కెప్టెన్‌ పొలార్డ్‌ 26 పరుగులు చేశాడు.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ (బి) రబాడ 16; లూయిస్‌ (సి) రబాడ (బి) కేశవ్‌ 56; పూరన్‌ (సి) మిల్లర్‌ (బి)కేశవ్‌ 12; గేల్‌ (సి) క్లాసన్‌ (బి) ప్రిటోరియస్‌ 12; పొలార్డ్‌ (సి) డసెన్‌ (బి) ప్రిటోరియస్‌ 26; రసెల్‌ (బి) నార్జ్‌ 5; హెట్‌మయర్‌ రనౌట్‌ 1; బ్రావో నాటౌట్‌ 8; వాల్ష్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) ప్రిటోరియస్‌ 0; అకీల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం:  (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143; వికెట్ల పతనం: 1-73, 2-87, 3-89, 4-121, 5-132, 6-133, 7-137, 8-137; బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 3-1-22-0; రబాడ  4-0-27-1; నార్జ్‌ 4-0-14-1; కేశవ్‌ 4-0-24-2; షంసి 3-0-37-0; ప్రిటోరియస్‌ 2-0-17-3

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: బవుమా రనౌట్‌ 2; హెండ్రిక్స్‌ (సి) హెట్‌మయర్‌ (బి) హొసీన్‌ 39; డసెన్‌ నాటౌట్‌ 43; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 51; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 144; వికెట్ల పతనం: 1-4, 2-61; బౌలింగ్‌: అకీల్‌ హొసీన్‌ 4-0-27-1; రవి రాంపాల్‌ 3-0-22-0; రసెల్‌ 3.2-0-36-0; హేడెన్‌ వాల్ష్‌ 3-0-26-0; బ్రావో  4-0-23-0; పొలార్డ్‌ 1-0-9-0Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన