హార్దిక్‌ గాయం పెద్దదేమీ కాదు..

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

హార్దిక్‌ గాయం పెద్దదేమీ కాదు..

దుబాయ్‌: పాకిస్థాన్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు అయిన గాయం అంత తీవ్రమైందేమీ కాదని తెలుస్తోంది. భారత్‌ తర్వాతి మ్యాచ్‌ (31న న్యూజిలాండ్‌తో)కు అతడు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే ఆడుతున్న అతడు.. పాక్‌పై 8 బంతులో 11 పరుగులు చేశాడు. పేస్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో అసౌకర్యంగా కనిపించాడు. ఓ షార్ట్‌ బంతి అతడు భుజాన్ని తాకింది. ‘‘హార్దిక్‌ స్కాన్‌ నివేదికలు వచ్చాయి. గాయం తీవ్రమైందేమీ కాదు. తర్వాతి మ్యాచ్‌ సమయానికి అతడు కోలుకుంటాడు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన